జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత నర్సింహాకు ఘన సన్మానం
మర్రిగూడ: జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు–2026 అందుకున్న రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు లపంగి నర్సింహాకు మంగవారం మర్రిగూడ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లపంగి నర్సింహాకు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవలో లపంగి నర్సింహా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగానే జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించిందని కొనియాడారు.ఈ సందర్భంగా లపంగి నర్సింహా మాట్లాడుతూ ఈ గౌరవం నాకు మాత్రమే కాదు రాంరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ దక్కిన గౌరవం. గ్రామ ప్రజల సహకారం,అధికారుల ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు సాధ్యమైంది.ప్రజాసేవే నా ధ్యేయంగా మరింత అంకితభావంతో పనిచేస్తాను" అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు లపంగి నర్సింహాకు శుభాకాంక్షలు తెలిపారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
