గౌరవెల్లి ప్రాజెక్టు ఆపడానికి కేసు వేసింది మీరే, సంబరాలు చేసుకునేది మీరే

హుస్నాబాద్  : గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో పటాకులు పేల్చి సంబరాలు చేసుకోవడం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిఆర్ఎస్ నాయకులు చౌటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గద్దల రమేష్ హాస్యాస్పదమని అన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు ఆపడానికి కేసు వేయించింది కాంగ్రెస్ వారే , సుప్రీం కోర్టుఆదేశాలతో పటాకులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటన్నది కాంగ్రెస్ వారేనన్నారు.హుస్నాబాద్ ప్రాంత వరదాయిని గౌరవెల్లి ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో మాజీ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్ హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో 1.4టీఎంసీ గా ఉన్న ప్రాజెక్టుని 8.23 టీఎంసీల కెపాసిటీ పెంచి 95శాతం పనులు పూర్తి చేయించి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తో ప్రారంబానికి సిద్ధం చేసిన సమయంలో ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ లు కలిసి ఆనాడు గుడాటిపల్లి కాంగ్రెస్ నాయకులతో చెన్నై లొ ఉన్న ఎన్జీటిలొ కేసు వేయించి ప్రాజెక్టు ప్రారంభం కాకుండా అడ్డుకున్నారన్నారు.కేసు వేయించిన విధానం ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో ఉన్న అడవి జంతువులు పులులు, చిరుతలు, కొండచిలువలు,జింకలు,అడవి నక్కలు ఇంక చాల జంతువులు చనిపోయాయని,బ్రతికున్న జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ప్రజల జీవనం భయబ్రాంతులకు గురైతున్నారని లేని జంతువులను పేపర్లలో సృష్టించి కేసు వేశారన్నారు.గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో అప్పటి ప్రభుత్వం విధానాలు కరెక్టుగానే ఉంది లేకుంటే ఈ రోజు సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చేది కాదు కదా అన్నారు.కావాలనే క్రియేట్ చేసి ప్రాజెక్టు ప్రారంభం ఇంత ఆలస్యం చేయించింది కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ , మరి ఈ రోజు ఎం సాధించారని పటాకులు పేల్చడం స్వీట్ల పంపిణి చేయడం,మీ కుటిల కుయుక్తులతో చేసిన పనికి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలి కానీ సంబరాలు చేయవద్దన్నారు.ఎందుకంటే మీరు సాధించింది ఎం లేదని మీ తాతంగాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి రైతంగం సిద్ధంగా ఉన్నారన్నారు. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి