రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక

400 మీటర్ల పరుగులో రజతం.. 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక

క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే దిశగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం మరోసారి సత్ఫలితాలను సాధించింది. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆల్ఫోర్స్ హైస్కూల్ చెందిన 8వ తరగతి విద్యార్థులు ఓ.విగ్నేష్ మరియు విష్ణు వర్ధన్ క్రీడా రంగంలో ప్రతిభను చాటుతూ సిద్ధిపేట జిల్లా స్థాయి ఎస్ జిఎఫ్  పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.400 మీటర్ల పరుగుపందెంలో విగ్నేష్ ఓ. రజత పతకం సాధించగా, 100 మీటర్ల హర్డిల్స్ రేసులో విష్ణు వర్ధన్ కాంస్య పతకం సాధించి ఆల్ఫోర్స్ హుస్నాబాద్ పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
విద్యార్థుల ఈ విజయంపై ఆల్ఫోర్స్ విద్యాసంస్థల గౌరవనీయ చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి  హర్షం వ్యక్తం చేస్తూ,విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి, వారికి సరైన వేదిక, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించడమే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల లక్ష్యమని తెలిపారు.ప్రతిభకు పట్టుదల తోడైతే విజయానికి హద్దులు ఉండవు అనే స్ఫూర్తిదాయక దృక్పథంతో ఆల్ఫోర్స్ సంస్థ విద్యార్థులను విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో రాణించేలా నిరంతరం ప్రోత్సహిస్తోందని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
విగ్నేష్, విష్ణు వర్ధన్‌ల విజయాన్ని అభినందిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, క్రీడా విభాగం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ఫోర్స్ హుస్నాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.విద్యార్థుల కృషి,ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి నిరంతర ప్రోత్సాహం కలగలిసి ఈ విజయాన్ని సాధించాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.
ఆల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు హుస్నాబాద్ విద్యలో నాణ్యత.. క్రీడల్లో ప్రతిభ.. ప్రతి అడుగులో విజయమే లక్ష్యంలో ముందున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం
గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ...
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి