ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశాయి.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసనలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, ఆయన తండ్రిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ నైతిక దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌కు ఉన్న అక్కసు, ద్వేషాన్ని ఖర్గే వ్యాఖ్యలు బయటపెట్టాయన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ  నాయకులు డిమాండ్ చేశారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం
గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ...
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి