నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe

అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ నాయకుల పిలుపు

నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe

లింగాల గణపురం (జనగాం) నాగారం : నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలనే స్థానిక ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి ఆదేశాల మేరకు నాగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు ఉపేందర్ అధ్యక్షతన, ఎన్నికల కో-ఆర్డినేటర్ బస్వాగాని అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని పట్టభద్రులను గడపగడపకు కలిసి ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: మాజీ సర్పంచ్ బోట్ల భాస్కర్, మండల సెక్రటరీ మిద్దపాక నగేష్, యూత్ అధ్యక్షుడు దండు జయచందర్, సీనియర్ నాయకులు దండు సుధాకర్, దండు పోచయ్య, ఉప్పల బాలరాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కడపదాసు కరుణాకర్, యూత్ నాయకులు బోట్ల లవకుమార్, మిద్దపాక నాగరాజు, ఉప్పాల నాగరాజు, దండు సురేష్, గోనెల అశోక్, గ్రామ ఎమ్మెల్సీ ఇన్‌చార్జి ఎర్ర క్రాంతి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చౌటకూర్ :  రైతులకు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.సంగారెడ్డి...
ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు
రాణిపేట సెయింట్ మేరీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe
మారుమూల ఆదివాసీ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన
అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలం ఇవ్వాలి.!