క్షేత్రస్థాయిలో వానకాలం డిజిటల్ పంట సర్వే... వ్యవసాయ అధికారి భాస్కర్
ఓదెల : డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా వానాకాలం పంటల నమోదు జరుగుతుందని మండల వ్యవసావ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.పంట నమోదు వాలంటీర్ క్షేత్ర స్థాయిలో పంట సర్వే చేసి డిజిటల్ క్రాప్ బుకింగ్ చేస్తున్నామన్నారు. వాలంటీర్లు పంట నమోదు చేసిన వెంటనే భూమి పాస్ బుక్ కు లింక్ ఉన్న నెంబర్ కు మెసేజ్ వస్తుందన్నారు.మెసేజ్ లో మీ సర్వే నెంబరు, అందులో ఏ పంట వేశారో సమాచారం ఉంటుందన్నారు.వచ్చిన మెసేజ్ లో మీరు వేసిన పంట తప్పుగా నమోదై తే వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని ఫోన్ సంప్రదించాలన్నారు.మీ పంట ఉత్పత్తులు అమ్ముకునే సమయంలో ఐకెపి (వరి) లో గాని, సిసిఐ (పత్తి) లో ఇబ్బందులు ఉంటాయన్నారు. మీ పంట తప్పుగా నమోదై తే మాత్రమే ఫోన్ లో సంప్రదించాలన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


