మధ్యాహ్న భోజన కార్మికుల కు పదివేల హామీ ని అమలు చేయాలి.
ఎమ్మెల్యే పోచారంకు వినతిపత్రం ఇచ్చిన ఏఐటియుసి నాయకులు.....
పెండింగ్లో ఉన్న మూడు నెలల వంట బిల్లుల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు......
బాన్సువాడ : మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల్లో హామీని అమలు చేయాలని బుధవారం ఏఐటియుసి నాయకుల ఆధ్వర్యం లో కార్మికుల కు మద్దతుగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బాన్సువాడ పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని బాన్సువాడ శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ సలహా దారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఇవ్వడం జరిగింది. వంట కార్మికుల సమస్యల ను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భం గా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న జూన్ జూలై ఆగస్టు పెండింగ్ వంట బిల్లులు వెంటనే విడుదల చేయాలి. సెంట్రలైజ్ కిచెన్ విధానం రద్దు చేయాలి అని ఆయన తెలిపారు . కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వంట కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తాన న్న ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాల ని కోడి గుడ్లను, గ్యాస్ నిత్యవసర వస్తువుల ను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన ఈ సందర్భం గా ఎమ్మెల్యే కు తెలియజేశారు. వంట కార్మికుల కు గుర్తింపు కార్డులు డ్రెస్ కోడ్ అమలు చేయాల ని తెలియజేశారు. వంట కార్మికుల కు ప్రమాద బీమా పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మంద శంకర్, చెన్నంగారి సురేష్, కమ్మరి రాములు, కూసుకుంట్ల సాయిలు, బాల్రాజ్, ఎస్ స్వరూప, కృష్ణవేణి, సావిత్రి, నాగ గౌడ్, కిషన్, ఎండి హుస్సేన్ బి, సువర్ణ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

