బాల్కొండ లో డబల్ బెడ్ గందరగోళం
అర్ధ రాత్రి లక్కీ డ్రా - విచారణ చెయ్యాలని దరఖాస్తూ దారుల డిమాండ్.
బాల్కొండ(నిజామాబాదు జిల్లా) : తెలంగాణ ప్రభుత్వo ప్రజా పాలన, గ్రామ సభలు ఏర్పాటు చేయగ డబల్ బెడ్ రూముల కోసం దరఖాస్తుల నమోదు చేసిన రిజిస్టర్లు కనపడ కుండా పోవడమే కాదు మా పేర్లకు ఆన్లైన్ నుంబర్ లేవని దరఖాస్తూ చేసుకున్న అభ్యర్థులు ఆరోపిస్తూన్నారు. బాల్కొండ లో 2వ విడుత డబల్ బెడ్ రూముల లక్కీ డ్రా బుధవారం సాయంత్రం రద్దు చేసిన జాబితాను స్థానిక నాయకులు గ్రామ పంచాయతీ లో కూర్చుండి మరో జాబితాను తైయ్యారు చేసారాని ఆజాబి తానే మల్లి రాత్రి 10 గంటలకు లక్కీ డ్రా పేరుతో లబ్ది దారుల ఎంపిక ఎలా చేసారని జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ ప్రదీప్ కుమార్, నర్సింగ్ రావు లు ప్రశ్నిస్తు న్నారు.ఇది ఇలా ఉండగా 2వ విడుత డబుల్ బెడ్ రూము అనర్హుల జాబిత మరియు ఆన్లైన్ నంబర్లు ఉన్న వారి (99) మంది లబ్ది దారుల పేర్లు మండల అభివృద్ధి అధికారి ద్వారా తహసిల్దార్ బాల్కొండ గారికి అంద జేశారు జాబితాలో క్రమ సంఖ్య (01) నుండి(54) ఇంటి నుంబర్ లు ఉండగా క్రమ సంఖ్య (01) నుండి (55)నుండి (99) వర్షకు ఇంటి నెంబర్లు ఎందుకు చూపలేదని ప్రజల ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ వ్యవ హారంలో అనర్హుల జబితాలో ఆన్లైన్ నెంబర్ లేకుండానే సీరియల్ నెంబర్ 1 నుండి 407 వరకు ఇంటి నెంబర్లు ఉన్నాయ.కానీ 408 నుండి 987 ఆన్లైన్ నుంబర్లు ఇచ్చి, ఇంటి నెంబర్లు ఇవ్వలేదని,
ప్రజా పాలనలో దరఖాస్తూ చెసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో నమోదు కాకుండా చేయడం ఇదేo లాజిక్కో అర్థం కావడం లేదని వారు ప్రశ్నించారు.ఇదే విషయాన్ని సెప్టెంబర్ 25 రోజున జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు.బాల్కొండ లో డబల్ బెడ్ రూము ఎంపికలు రాత్రి 10:08 ప్రారంభం వేదికకు ముందే చేరుకున్న లబ్ది దారులు వీరి వెంట లబ్ది దారుల పేర్లను సిఫారసు చేసిన పెద్దలకూడా రావడం విశేషం డబల్ బెడ్ రూమ్ ల ఎంపికల్లో ఆర్ధికంగా, వ్యవ సాయ భూములు,ఇల్లు ఉన్న వారికే ఇచ్చుకున్నారని పైగా ముస్లిం మైనారిటీలు బి. సి. లు ఎలా అవుతారని బి. సి. కోటలోనే కాకుండా ముస్లిం మైనారిటీల కోటలో కూడా డబల్ బెడ్ రూములు ఇచ్చుకున్నారని ప్రజలు ప్రశ్నస్తున్నారు.మరో విచిత్రం ఏమంటే ఆర్మూర్ నుండి 3 నెలల క్రితం వచ్చిన వారికి, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో పనిచేసే వారికి, వ్యవసాయ భూములు,, ఇల్లతో పాటు ఆర్ధికంగా బాగున్నా వాళ్లు,మరో ఇద్దరూ విలేకరుల బoదుత్వం వాళ్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్ కుటుంబీకులకు అన్ని రాజ కీయా నాయకుల రక్త సంబందికులకు డబల్ బెడ్ రూము ఎలా వచ్చాయని డబల్ బెడ్ రూములు రాని దరఖాస్తూ దారులు ప్రశ్నిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


