ఆటో బోల్తా - ముగ్గురికి గాయాలు, 108 సిబ్బంది సమయస్ఫూర్తి
సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి సబ్‌స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి 8:20 గంటలకు ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన రాథోడ్ లక్ష్మణ్ (40, తండ్రి: సవాయి శివుని) తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే 108 సిబ్బంది ఈఎంటి ప్రభాకర్, పైలట్ మహేష్ అలాగే 100 పోలీసు సిబ్బంది అప్రమత్తమై క్షతగాత్రులను కాపాడారు. వెంటనే వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు.
Views: 64
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
