తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోయాబీన్ పంట
నష్టాన్ని పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోయాబీన్ పంటను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన మాళవిక రకం వెరైటీ విత్తనం సోయాబీన్ పంట దెబ్బతినడాన్ని,మొక్కలు సరిగా రాకపోవడాన్నిస్వయంగా పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రకం విత్తనాలు వేసిన పొలాల్లో కొన్ని మొక్కలు మొలకలు రావడం, కొన్ని పచ్చిగా ఉంది, కొన్ని మొక్కలు ఎండిపోవడం జరుగుతోందన్నారు. 70 నుండి 80 శాతం పంట దెబ్బతిందని, 56 మంది రైతులు ఈ వెరైటీ ని దాదాపు 400 ఎకరాల్లో వేయడం జరిగిందన్నారు. రైతుల పరిస్థితిని జిల్లా ఇంచార్జ్ మంత్రికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రుయ్యాడిలోని గోడౌన్‌లను కూడా పరిశీలించి, అక్కడ మెరుగైన వసతులు, రోడ్డు సౌకర్యం, కాంపౌండ్ వాల్ మరియు సీసీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రైతులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈ సారి పత్తి కొనుగోళ్లను అక్టోబర్ 12 నాడే ప్రారంభించేలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్ఛారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ సభ్యులు మద్దెల పోశెట్టి, కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ఏలుగు రాజన్న, వెంకట్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, సజ్జనపు కిషన్,రాకేష్ రెడ్డి, దేవన్న, ప్రవీణ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, నవీన్ రావు , ఇందూరి దివాకర్, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సాంబశివ్, చెన్నాల సాయి కిరణ్ (యూత్ కాంగ్రెస్), చిన్న రాజారెడ్డి, గోక శ్రీనివాస్ రెడ్డి, నిమ్మల సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రామ్ రెడ్డి, గోక రాజు, లక్ష్మన్న, కంచరి చారి, , స్వామి, గంగాధర్ తదితర రైతులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


