వారబందీ ప్రకారమైనా నీరివ్వాలి
కలెక్టరేట్ ఎదుట జూరాల కుడి కాలువ రైతుల బైఠాయింపు
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా జూరాల కుడి ప్రధాన కాలువ కింద సాగు చేస్తున్న వివిధ గ్రామాల రైతులు తమ పంట పొలాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ ప్రకారం కూడా కాలువలకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.కాలువలకు నీరు సక్రమంగా రాకపోవడంతో ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పంటలు దెబ్బతినకముందే అధికారులు స్పందించి జూరాల కుడి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


