పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గంభీరావుపేట మండల కేంద్రంలోనీ షాది ఖానా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. : తహసిల్దార్ మారుతి రెడ్డి
గంభీరావుపేట : పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిదిశెట్టి విజయ తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోప్రజా ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం గంభీరావుపేట మండల కేంద్రంలో నీ షాది ఖానా లో నిర్వహించగా, ముఖ్య అతిథిలాగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ,, తహసిల్దార్ మారుతి రెడ్డి, మండలానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ . ప్రజా ప్రభుత్వం మండలంలో నూతన రేషన్ కార్డులను మంజూరు చేసిందని తెలిపారు. మండలం మొత్తం కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు గుర్తింపు కార్డు మాత్రమే కాదని, పేదలకు గౌరవంతో పాటు ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు ఉపయోగపడే ముఖ్యమైన పత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. సంపన్నులు తినే సన్నబియ్యాన్ని పేదలు కూడా తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని తెలిపారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రాష్ట్రవ్యాప్తంగా రూ.21,650 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ ,బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్, నాయకులు బంగ్లా రాజు గౌడ్, మల్యాల రాజు వీర్, పోయిన ప్రభాకర్, గాండ్ల బాలలక్ష్మి, శ్రీజ, మోతి లత, రేణుక, టేకుమల్ల ప్రవీణ్, దేశెట్టి రాజశేఖర్, శ్రావణ్ యాదవ్, మల్లేశం, ఎల్లారెడ్డి, తాజా దిన్, తాహెర్, గౌరీ శంకర్, లక్కం నాంపల్లి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


