రోడ్డు కాదు.. బురద కూపం

రోడ్డు కాదు.. బురద కూపం

  • దామస్తాపూర్–షాపూర్ రహదారిపై నరకయాతన
  • మధ్యలోనే నిలిచిన పనులు.. వాహనదారుల అవస్థలు
  • ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా? అంటూ స్థానికుల ఆగ్రహం

మర్పల్లి, (వికారాబాద్ జిల్లా ) మండలంలోని దామస్తాపూర్ నుంచి షాపూర్  వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డు  పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వర్షాలకు రహదారి అంతా బురదతో నిండిపోయి ప్రయాణం ప్రమాదకరంగా మారింది.ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. బురదలో వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొనడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, ఉద్యోగాలు, వ్యవసాయ పనుల నిమిత్తం ఈ రహదారిపై నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోడ్డు పనులు ప్రారంభించిన తర్వాత వాటిని పూర్తిచేయ కుండా మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజలకు మరింత కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రహదారి మొత్తం బురద కూపంగా మారి వాహనాల రాకపోకలు సైతం ప్రమాదకరంగా మారాయని చెబుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దామస్తాపూర్–షాపూర్–కల్కోడ్ రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని వాహనదారులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే వరకు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ