లయన్స్ క్లబ్ మిల్లినియం ఆధ్వర్యంలో డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలు
కొత్తగూడెం :లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం ఆధ్వర్యంలో రామవరంలోని బిల్డింగ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్ కార్యాలయంలో పాస్ట్ గవర్నర్ డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు లయన్ సభ్యులు మాట్లాడుతూ డా. కాపా మురళీకృష్ణ సమాజ సేవలో అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ లయన్స్ క్లబ్ కార్యకలాపాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిల్లినియం అధ్యక్షుడు లయన్ దోతి బాబురావు, కార్యదర్శి లయన్ పగడాల నాగేష్, ఆర్.సి. మండల రాజేశ్వరరావు, సీనియర్ సభ్యులు లయన్ రాయల శాంతయ్య, లయన్ పితాని సత్యనారాయణ, జె.బి. మోహన్, దాబ్బేట రాజయ్య, లయన్ నాగలక్ష్మి, సంహిత అధ్యక్షురాలు లయన్ ఉషారాణితో పాటు ఇతర సభ్యులు పాల్గొని డా. కాపా మురళీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
