అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిసిన బండారు ప్రక్రియ.
ఆగస్టు 2వ తేదీన జరిగే ఊర పండగకు భారీగా ఏర్పాట్లు.
నిజామాబాద్ :ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్న ఊర పండుగను పురస్కరించుకొని గురువారం బండారు ప్రక్రియను పూర్తి చేశారు. సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఆగష్టు 2 తేదిన ఆదివారం జరగనున్న ఊర పండుగ నూ పురస్కరించుకొని శుభసూచకంగా గురువారం నిజామాబాద్ (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ,శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమ, పూలతో బండారు ప్రక్రియతో పాటు, కల్లు సాకాలు సమర్పించారు.ఈ సందర్బంగా దున్నపోతునూ ఊరి మీదకు విడవడం జరిగింది. గురువారం నుండి మన గ్రామ దేవతలా విగ్రహాలు తయారీ, ఊర పండగ కోసం ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సర్వ సమాజ్ కమిటీకో కన్వీనర్ ఆదే ప్రవీణ్ తెలిపారు. అలాగే అనాదిగా వస్తున్న ఆచారం, పెద్దల ద్వారా వస్తున్న ఊర పండుగ మన గ్రామ దేవతల ఊరేగింపులో ప్రజలందరు పెద్ద ఎత్తున పాల్గొని మన గ్రామ దేవతల తల్లుల ఆశీర్వాదం పొందాలని సూచించారు. ఈ ఊర పండుగతో పాడిపంటలు, పశుసంపాద వృద్ధి చెందాలని, పిల్లలు, పెద్దలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరీకి అష్టఐశ్వరాలనూ కలగాలని, దృష్ట శక్తులు దరి చేరకుండా ఉండాలని సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ అదే ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోరడి కిరణ్, ఉపాధ్యక్షులు, కార్పొరేటర్ మల్కాయి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామాడ్గు బాలకిషన్, సెక్రటరీ ధామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మినారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి, లింబాద్రి స్వామి, కొరడీ చిన్న నర్సయ్య, కోర్వ భూపాల్, పెద్ద మనుషులు సుంకేటి ప్రవీణ్, మల్కాయి భోజన్న, జానకంపేట్ అశోక్, మల్కాయి సుదర్శన్, పసుల రాజు తదితరులు పాల్గొన్నారు
Views: 121
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
