టిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొట్టాల యాదగిరి
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన కొట్టాల యాదగిరి మంగళవారం మొదటిసారిగా గజ్వేల్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి కొట్టాల యాదగిరి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కమిటీలు వేసి, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను పండగలా నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు ఎడ్ల నర్సింలు మాజీ ఎంపీటీసీ, నవీన్, అశోక్, రాజు, చందు, సురేష్, ప్రసాద్, నర్సింలు, నరేష్, హరి, తదితరులు పాల్గొన్నారు.
Views: 194
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
