డిజిటల్ పోలీసింగ్‌పై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం,: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సైబర్ నేరాల నియంత్రణలో వేగం పెంచడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్‌గ్రిడ్ వంటి కీలక డిజిటల్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమైన ఎస్పీ, ఆయా విభాగాల పనితీరు, పెండింగ్ అంశాలు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదు, సేవల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, ఇతర సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గుర్తింపు, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నాట్‌గ్రిడ్, గాండీవా వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ సమాచార విశ్లేషణ ద్వారా నేరాల నియంత్రణ, దర్యాప్తులో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సైబర్ నేరాలపై వచ్చిన ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలని, బాధితుల డబ్బు రికవరీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అలాగే జీఆర్ఎం, ఎంఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ పోర్టళ్లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజల్లో డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్-111 అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది నిరంతరం సాంకేతిక శిక్షణ పొందుతూ సైబర్ నేరాల నియంత్రణలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డేటా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ అధికారిక సమాచారాన్ని గోప్యంగా భద్రపరచాలని, సైబర్ భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 45
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
