ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసిన మండల అధికారులు

 ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసిన మండల అధికారులు

చౌటకూర్, జూలై 17: చౌటకూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటశాల, ఆహార నాణ్యత, వంట సామగ్రి, పారిశుధ్యం తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన అధికారులు హాస్టల్‌లో అందుతున్న భోజనం, వసతి, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన అధికారులు అక్కడి విద్యార్థులతో కూడా మాట్లాడి విద్యా బోధన, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నామాల కిష్టయ్య, ఎంపీడీవో శంకర్, ఎంఈఓ అనురాధ, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రవీందర్, ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 68

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ