నూతన అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ
కొమురవెల్లి (సిద్దిపేట ) : కొమురవెల్లి మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నూతన అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేయడం జరిగింది. చిన్నారుల సంక్షేమానికి అంగన్వాడి భవనాలు నిర్మాణం చాలా కీలకమని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అంగన్వాడి భూమి పూజతో పాటుగా కొమురవెల్లి మండలం లో ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొండపాక ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విత్తనాలు , ఎరువుల దుకాణాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొమురవెల్లి గ్రామ సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు, ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, ఎంపీడీవో, వార్డ్ సభ్యులు, గ్రామ కార్యదర్శి, కొమురవెల్లి మండల బిఆర్ఎస్ నాయకులు , గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
