ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : అంగడి ఆనంద్
మేడిపల్లి/భీమారం (జగిత్యాల జిల్లా) : ఓడ్యాడ్ గ్రామంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్ ప్రోగ్రాం ఇన్చార్జ్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్ తెలిపాడు. సర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ తో కలిసి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం అర్హులైన ఓటర్లకు దరఖాస్తు ఫారాలను అందజేశాడు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని పేర్కొనడం జరిగింది. అనంతరం సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ మాట్లాడుతూ... గ్రామంలో ఇప్పటివరకు 90 శాతం ఓటర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తయిందని, త్వరలోనే 100 శాతం నమోదు పూర్తి చేస్తామని తెలిపాడు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమ్య, బీఎల్ఓ బావమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ శైలజ, ఆశా వర్కర్ జమున తదితరులు పాల్గొన్నారు.
Views: 44
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
