గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిన మోదీ సర్కార్.

గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిన  మోదీ సర్కార్.

గంభీరావుపేట (రాజన్నసిరిసిల్ల జిల్లా) :గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్  గత పన్నేండేళ్లలో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అభివ్రుద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదని పేర్కొన్నారు. పల్లె ప్రక్రుతి వనాలు, రైతు భరోసా కేంద్రాలు, స్మశానవాటికలుసహా గ్రామాల్లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనేనని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణలోని గ్రామాల్లో దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ.వేల కోట్లతో రోడ్లు నిర్మించినట్లు వివరించారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లిలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కింద కేంద్రం 20 లక్షలు, స్పెషల్ డెవలెప్ మెంట్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5లక్షలల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మహేష్, పాలకవర్గ సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపీ, మండల అధ్యక్షుడు కోడె రమేష్ , స్థానిక బీజేపీ నాయకులు, అధికారులతో కలిసి నూతన పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.  గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణమే కాదు, గ్రామాల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందంటే ప్రియతమ ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని మీకు తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో గ్రామ పంచాయతీల అభివ్రుద్దికి ప్రత్యేకంగా ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పగలదా? లేదు. ఎందుకంటే నయాపైసా ఇయ్యలేదు.  మీ గ్రామంలో వేసిన సీసీ రోడ్డు, చెరువు పూడికతీత, అంగన్‌వాడీ భవనం, శ్మశానవాటిక, తాగునీటి పైప్‌లైన్, రోడ్డు... వీటన్నింటికీ పైసలిచ్చింది మోదీ ప్రభుత్వమే,లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి కల్పించినం. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులను నిర్మించినం. సీఆర్ఐఎఫ్ ద్వారా దాదాపు 6 వేల కోట్లతో  గ్రామాలు, మండలాలు, పట్టణాల మీదుగా  రోడ్లు నిర్మిస్తున్నం. జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నం. ఇవి గాకుండా మరెన్నో పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు క్రుషి చేస్తున్నం. అని అన్నారు. గ్రామాల అభివ్రుద్ధి బీజేపీతోనే సాధ్యం. గ్రామాలు అభివ్రుద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని నమ్మి గ్రామాలకు పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నా అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీధర్ బాబు, డి.ఎస్.పి నాగేంద్ర చారి, తహసిల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, సీఐ వెంకటేష్, ఎస్సైలు సిహెచ్ శ్రీకాంత్, దయానంద్, రాహుల్ రెడ్డి లతోపాటు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు వార్డు సభ్యులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
 
 
Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ