జిల్లా విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారిపై కార్యాలయ సిబ్బంది చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్‌ఈ) ఆదేశాలతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) విచారణ చేపట్టి పూర్తి నివేదికను అందజేయాలనీ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా విద్యాశాఖ అధికారిపై పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో పాటు కార్యాలయ నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే విధంగా ఈ మధ్యనే ప్రైమరీ పాఠశాల సమగ్ర శిక్ష కింద 41 పాఠశాలలకు ఒక్క పాఠశాలకు లక్ష రూపాయల నిధులు మొత్తం 41 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తే ఎలాంటి టెండర్ లేకుండా ఏకపక్షంగా జిల్లా విద్యాశాఖ అధికారి తమకు అనుకూలంగా వున్నా సంస్థ కు కట్టబెట్టారానే ఆరోపణ కూడా వారి పై వున్నది. విచారణ నిమిత్తం అధికారులు తొందరలోనే జిల్లాకు వస్తున్నారన్న సమాచారం తో పరిణామాల మధ్య శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబంధిత అధికారి హుటా హుటిన పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో తమ వద్ద నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని అధికారులు విచారణ బృందానికి చెప్పాలని కొందరు పాఠశాలల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారిపై గత కొంతకాలంగా వివిధ అంశాల్లో అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ నిష్పాక్షికంగా జరిగి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలపై వివరణ కోసం సంబంధిత అధికారిని పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.ఈ వ్యవహారం పై అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
