కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
మధిర,: దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కొరకు నీటి పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులు సరి చేయాలని, పరీక్ష నిర్వహణలో నిజాయితీ ఉండాలని, 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విజ్ఞాన వేత పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సంఘీభావంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విక్రమార్క నుండి ర్యాలీగా మహాత్మా గాంధీ విగ్రహానికి వెళ్లి మాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యస్ నాగేశ్వరావు మాట్లాడుతూ మనదేశంలో మూడు సంవత్సరాలుగా నీట్ నిర్వహణ పాలకవర్గాలు నిర్లక్ష్యం కారణంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. విద్యార్థుల తరఫున 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కళ్ళుండి చూడలేని చెవులు ఉండి వినలేని ఈ దేశం గుట్టిపాలనలో ఇంతటి క్రూరత్వాన్ని చూడలేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల పైన కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసిందని చాలామంది ఓట్లు తొలగించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దేశంలోని మేధావులు దేశం ప్రమాదంలో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హిందూ మతం, దేశ రాజ్యాంగం, పరీక్షల నిర్వహణ ప్రమాదంలో ఉందని అన్నారు. శనివారం నీట్ విద్యార్థులకు సంఘీభావంగా పట్టణంలోని వైద్యుల విద్యావేత్తలు విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మొగిలి శ్రీను, పుష్ప పండు, యన్ పవన్, జీవన్, కృష్ణమూర్తి, బొడ్డు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
