ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
హన్మకొండ : హనుమకొండ/కాజీపేట: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట 63వ డివిజన్ పరిధిలో ప్రభుత్వ బాల బాలికల పాఠశాలలో మాజీ కార్పొరేటర్ గుంటి కుమార్ తన సతీమణి కనకతార వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినతాగునీటి ప్లాంట్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇస్తూ, సంబంధిత అధికారులు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
