రైతులు నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి
మేడిపల్లి/భీమారం, (జగిత్యాల జిల్లా) : పోరుమల్ల గ్రామంలో వ్యవసాయ పంట పొలాలను కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించడం జరిగింది. అనంతరం సత్య ప్రసాద్ మాట్లాడుతూ... ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తగ్గి పంటలకు నీటి కొరత ఏర్పడి ఎండిపోయే పరిస్థితి ఉంది. కనుక రైతులు జాగ్రత్తగా నీటి వనరులను ఉపయోగించుకోవాలని, తక్కువ నీటితో పండే మినుము, పెసర, అనుము లు, కందులు లాంటి పంటలు పండించుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలని, వరి పండించాలంటే నీరు అధికంగా అవసరం ఉంటుంది కావున రైతులు ఆరుతడి పంటలను పండించు కోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ఆర్డీవో కోరుట్ల, మేడిపల్లి మండల తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు, రైతులు పాల్గొనడం జరిగింది.
Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
