విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు

విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు

కారేపల్లి (ఖమ్మం) : గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం విమర్శించారు. ప్రభుత్వానికి విద్యారంగంపై చిత్తశుద్ధి లేదని,గిరిజన సంక్షేమ హాస్టళ్లు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్‌ను సిపిఎం నాయకుల బృందం సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.అనంతరం పాఠశాల ఆవరణ,వంటశాల, భోజనశాల,హాస్టల్ వసతులను పరిశీలించింది.ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ...జిసిసి ద్వారా గిరిజన హాస్టళ్లకు సరఫరా చేస్తున్న కారం పొడి,పసుపు, చింతపండు వంటి నిత్యావసర సరుకులు నాసిరకంగా ఉన్నాయని,వాటిని వెంటనే ఉపసంహరించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని భద్రాచలం జిసిసి జనరల్ మేనేజర్ సమ్మయ్య దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.అదేవిధంగా సివిల్ సప్లైస్ ద్వారా అందిస్తున్న బియ్యం కూడా నాణ్యమైనదిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.గిరిజన విద్యార్థుల ఆరోగ్యంతో రాజీపడకుండా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.విద్యాలయం చుట్టూ భద్రతా దృష్ట్యా వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని,పాఠశాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం సిపిఎం నాయకులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.భోజనంలో మరింత నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్, వార్డెన్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరావు, కారేపల్లి మండల నాయకులు తలారి దేవప్రకాష్, రేగళ్ల మంగయ్య,కేశగాని ఉపేందర్,యండీ ఇస్మాయిల్,యనమనగండ్ల రవి,బానోత్ కిషన్ నాయక్,కర్కెపల్లి రాయమల్లు,ధారావత్ వినోద్ కుమార్,ఎజు రత్నం,రాచర్ల రణధీర్,పచ్చిపాల యాకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ