జర్నలిస్ట్ లకు హెల్మెట్ లను పంపిణీ చేసిన డాక్టర్ కృష్ణమూర్తి

జర్నలిస్ట్ లకు హెల్మెట్ లను పంపిణీ చేసిన డాక్టర్ కృష్ణమూర్తి

మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సంగారెడ్డి లోని హోప్ న్యూరో & కార్దియాక్ హాస్పిటల్ యం.డి న్యూరో సర్జన్ డాక్టర్.టీ.కృష్ణ మూర్తి తన స్వంత మండలం రేగోడ్ జర్నలిస్ట్ లకు హెల్మెట్ లను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా ఈ హెల్మెట్ లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.సమాజ సేవలో జర్నలిస్ట్ ల పాత్ర చాలా కీలకమని కొనియాడారు. వారు సమాజ సేవలో ముందుండి ప్రజలకు సమాజంలో జరిగే వార్తలను సేకరించి వారిని ప్రజలకు అందిస్తూ అనునిత్యం ప్రజా సేవలో జీవిస్తూ ఉంటారని తెలిపారు. వారికి రక్షణ ఉండాలనే ఉద్దేశ్యంతో నేడు హెల్మెట్ ల ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ప్రతి ఒక్కరు సమాజం లో సేవా దృప్పదం కలిగి ఉండాలని తహసీల్దార్ దత్తు రెడ్డి తెలిపారు.ఎస్సై పోచయ్య మాట్లాడుతూ బైక్ నడిపే ప్రతి ఒక్కరు తప్పకుండ హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు తలకు రక్షణగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మన్నే భాస్కర్, మండల జర్నలిస్ట్ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల జర్నలిస్ట్ లు, హోప్ న్యూరో & కార్దియాక్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏ.శ్రీనివాస్, పాండు నాయక్,టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ