చౌటకూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు దుర్మరణం
చౌటకూర్,: నేషనల్ హైవే అపోలో నాందేడ్ జాతీయ రహదారిపై 161 రహదారిపై చౌటకూర్ మండలం కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన నట్టల నర్సింహాగౌడ్ (80) లూనాపై తన పనుల నిమిత్తం వెళ్తుండగా, వెనుక నుంచి అధిక వేగంతో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో నర్సింహాగౌడ్ రోడ్డుపై పడిపోగా, తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం పుల్కల్ ఎస్సై విశ్వనాధన్ ఘటన స్థలానికి వచ్చి నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
