విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): భద్రాచలం నియోజకవర్గం శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు చర్ల మండలంలో పర్యటించి స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కె జి బి వి) క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఈ పర్యటనలో భాగంగా ఆయన పాఠశాలలోని విద్యా ప్రమాణాలతో పాటు, విద్యార్థినులకు అందుతున్న వసతులు, భోజనం, తాగునీరు మరియు పారిశుద్ధ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు
విద్యార్థినులతో ఆత్మీయ సంవాదం
పాఠశాల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యే విద్యార్థినులతో స్వయంగా ముచ్చటించారు, వారి విద్యాభ్యాసం, ఎదుర్కొంటున్న సమస్యలు మరియు అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు,
మౌలిక వసతుల కల్పనకు ఆదేశాలు
పాఠశాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, దీని కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి, చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు, సీనియర్ నాయకులు బ్రహ్మానంద రెడ్డి, శ్లంక రాజు, సీతాపతి రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు..jpg)
.jpg)
Views: 78
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
