సర్ పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలి
హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58, 59, 60 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలతో సమీక్షా సమావేశాన్ని శ్రీనగర్ కాలనీ పాపులర్ గార్డెన్స్ నందు శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... తెలంగాణ ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ వరకు పొడగించిందని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఎల్ఏలకు సూచించారు. సర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియమించిన బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్నారని అన్నారు. పలువురు ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నారని వారికి సాయంగా గులాబీ శ్రేణులు పని చేయాలని కోరారు. ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకున్న ఓటర్లు సంబంధిత బీఎల్వోలకు వివరాలు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇచ్చేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి, చనిపోయిన వారి ఓట్ల సమాచారాన్ని బీఎల్వోలకు అందించాలని సూచించారు. తప్పులు, అవకతకలు లేని ఓటర్ లిస్ట్ తయారీలో కీలకంగా మారే సర్ ప్రక్రియలో బాధ్యతాయుతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డివిజన్ల వారీగా ఇప్పటికే పార్టీ తరపున హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసిన నాయకులను అభినందించారు. పార్టీ కార్యాలయం కేంద్రంగా సర్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు, సమాచారం అవసరం ఉన్నా సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో 58, 59, 60 డివిజన్ల ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


