నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన

నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన

దౌల్తాబాద్(సిద్ధిపేట):దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని డీఎల్పీఓ చందన సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించి, వాటి పెరుగుదల, సంరక్షణ, నీటి పారుదల సౌకర్యాలు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. నర్సరీలో ప్రతి మొక్కను సక్రమంగా సంరక్షిస్తూ, గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. మొక్కల మనుగడ శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామంలోని ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, నర్సరీ నిర్వహణలో పారదర్శకత పాటించాలని, మొక్కల సంఖ్య, పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని, ప్రతి గ్రామం పచ్చని వాతావరణంతో కళకళలాడేలా సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.

Views: 66

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ