మైనర్ బాలిక కేసు..బెటాలియన్ కానిస్టేబుల్ అరెస్ట్
కొత్తగూడెం : కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో A-6 నిందితుడైన బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు వెంకటేష్ మైనర్ బాలికను కొత్తగూడెం పాత డిపో ప్రాంతంలోని ఓ గదికి తీసుకెళ్లిన సమయంలో, ప్రధాన నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని కేసులో A-6 నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఈ నెల 11న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు వెంకటేష్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
