రెవెన్యూ కార్యాలయానికి రూ.52 వేల విలువైన ఇన్వర్టర్ విరాళం
చౌటకూర్: చౌటకూర్ మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయానికి గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డి రూ.52 వేల విలువైన బ్యాటరీ ఇన్వర్టర్‌ను విరాళంగా అందజేశారు. కార్యాలయంలో విద్యుత్ అంతరాయాల సమయంలో అధికారులు, సిబ్బంది విధులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈ ఇన్వర్టర్‌ను అందించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, ఆయన చేసిన సేవలను అభినందించారు. ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సహకరించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, తాసిల్దార్ నామాల కిష్టయ్య, ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తహసీల్దార్ అనుదీప్, మండల స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్కల రమేష్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 107
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
