కొత్త ఎస్ హెచ్ ఓ ను సన్మానించిన : బీజేపీ మండల అధ్యక్షులు
ములుగు: ములుగు పోలీస్ స్టేషన్ కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ ను భారతీయ జనతా పార్టీ మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ వెంకటేష్ ను శాలువాతో సన్మానించి పూలబొకే అందజేశారు. అనంతరం బైకాని మహేందర్ యాదవ్ మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు.ములుగు మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి, మహిళల భద్రత, యువతను డ్రగ్స్ బారి నుండి కాపాడేందుకు పోలీస్ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీజేపీ తరపున పూర్తి సహకారం ఉంటుంది" అని బైకాని మహేందర్ యాదవ్ తెలిపారు. ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి సమన్వయం ఉండాలని, చిన్న చిన్న సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో మండలంలో శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మచ్చిక రవి గౌడ్, కొండ యుగంధర్, మండల ప్రధాన కార్యదర్శి ఎండిగ రాజు, రాగుల శ్రీకాంత్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


