జిపిఓపై దాడిని ఖండించిన గ్రామ పాలన అధికారుల సంఘం

జిపిఓపై దాడిని ఖండించిన గ్రామ పాలన అధికారుల సంఘం

చౌటకూర్ : వడ్డేపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న బీఎల్ఓ సూపర్వైజర్ (జిపిఓ) సంబరబోయిన సత్యనారాయణపై జరిగిన దాడిని గ్రామ పాలన అధికారుల సంఘం (జీపీఓ అసోసియేషన్) చౌటకూర్ మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చౌటకూర్ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.సంఘం తెలిపిన వివరాల ప్రకారం, జూలై 15న సాయంత్రం వడ్డేపల్లి గ్రామంలో ఈఎఫ్  ఫారాల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సమయంలో ముక్కగళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడికి వచ్చి దురుసుగా ప్రవర్తించి, విధుల్లో ఉన్న బీఎల్ఓ సూపర్వైజర్ సంబరబోయిన సత్యనారాయణపై చేయి చేసుకుని, ముఖంపై దాడి చేసి పిడిగుద్దులతో కొట్టినట్లు ఆరోపించారు.విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఉద్యోగుల భద్రతను కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారుల సంఘం మండల అధ్యక్షుడు సమీర్, జిల్లా అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణ, ఈశ్వర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ