మహిళా సంఘాలకు సొంత భవనం
కొత్తగూడెం :సుజాతనగర్ మండలంలోని రామవరం–2 ఇంక్లైన్ గ్రామపంచాయతీ పరిధిలో వెలుగు మరియు డాక్రా మహిళా సంఘాల సమావేశాల కోసం కొత్తగా నిర్మించనున్న భవనానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మంజూరు చేసిన నిధులతో ఈ భవనం నిర్మించబడనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు అరుణ, ఉపసర్పంచ్ సింగరాల రమేష్, వార్డు సభ్యులు ఎల్లబోయిన రాములు, కళావతి, గడ్డం మురళి, సింగిరాల రేణుక, బండి శృతి, పూనెం రాజమణి పాల్గొన్నారు. అలాగే సీపీఐ రామవరం ప్రజా సం ఘాల నిర్మాణ కార్యదర్శి, అభ్యుదయ కవి తూముల శ్రీనివాస్, సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ అంకుష్, మాజీ సర్పంచ్ గుగులోతు నగేష్, పంచాయతీ కార్యదర్శి రోహిణి, మహిళా నాయకులు పాముల ఉమామహేశ్వరి, కావ్య, తూముల రత్నకుమారి, గుంజపడుగు సరిత, అనుపమ, కల్పన, అర్చన, ఓం లత, లహరి, జయలక్ష్మి, కాంట్రాక్టర్ రవి, సీపీఐ గరిపేట నాయకులు రాంబాబు, సీపీఐ యువ నాయకుడు సింగిరాల బన్నీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహిళా సంఘాలకు శాశ్వత సమావేశ వేదికగా ఈ భవనం ఉపయోగపడుతుందని, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల విస్తరణకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక సాధికారతకు ఇటువంటి మౌలిక వసతులు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
Views: 49
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
