ఎస్‌ఐఆర్ నమోదు శాతం పెంచాలి.
జగిత్యాల : జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతి, నమోదు శాతాలపై జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని బి.ఎల్.ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపించి, వాటిని త్వరితగతిన బి.ఎల్.ఓలకు అందజేసేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల అర్బన్, రూరల్ మండల తహసీల్దార్ లు రామ్ మోహన్, హకీమ్, సూపర్వైజర్లు, బి.ఎల్.వో లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 58
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
