ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి

ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి

దౌల్తాబాద్ ,సిద్ధిపేట:  జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ  పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ సూచించారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆహార ధాన్యాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.జిల్లాలో మొత్తం 10,47,075 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 8,48,446 మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇది 81.03 శాతానికి సమానమని పేర్కొన్నారు. కొన్ని రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులలో కొందరు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేయగా, మిగిలిన వారు ఇంకా చేయించుకోలేదని తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందజేసి, వారిని సంప్రదించి ప్రక్రియ పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారు తమ సమీప చౌక ధరల దుకాణాన్ని సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Views: 458

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ