చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థినులు గ్రామీణ వ్యవసాయ కార్యాచరణ అనుభవ కార్యక్రమం (rawe)లో భాగంగా శుక్రవారం చౌటకూర్ మండలం కేంద్రంలో చౌటకూర్ గ్రామంలో రైతులకు వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సామాజిక పటం, వనరుల పటం, కాలక్రమ పటం, పంటల పటం తదితర వివిధ రకాల గ్రామ పటాలను రూపొందించి గ్రామంలోని సహజ వనరులు, వ్యవసాయ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, వివిధ పంటల సాగు విధానాలు, పంటల నిర్వహణపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శంకర్, మండల ప్రత్యేక అధికారి వసంత కుమారి, తహసీల్దార్ కృష్ణయ్య, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి, వ్యవసాయ అధికారి ప్రవీణ, టీఆర్‌వీకే సమన్వయకర్త అరుణ ,వ్యవసాయ కళాశాల విద్యార్థినులు శ్రీనిధి, దివ్య, రితిక, ధృతి, ఎస్తేర్ రాణి కార్యక్రమ నిర్వహణలో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై వ్యవసాయ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


