నిజాన్ని నిర్భయంగా రాయాలి.. నైతిక విలువలను కాపాడాలి.
- మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
- నిజాన్ని నిర్భయంగా రాయాలి.. నైతిక విలువలను కాపాడాలి
- జర్నలిస్టులు సమాజానికి వారధిగా పనిచేయాలి
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
- ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పాత్రికేయుల దే : కలెక్టర్
కామారెడ్డి బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 29,30 తేదిల లో రెండు రోజుల పాటు కొనసాగిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు ప్రశాంతంగా ముగిశాయి. జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువలను కాపాడుకుంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాస్తూ, ప్రజలకు వాస్తవాలను చేరవేసే బాధ్యతాయుతమైన పాత్రికేయులుగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాలు మండలాలకు చెందిన జర్నలిస్టుల శిక్షణ తరగతులను తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ వర్కింగ్ జనరల్ యూనియన్ ఆధ్వర్యంలో బాన్సువాడలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కె. శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు.పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు చేరే వార్తలు వాస్తవాధారంగా, ఆసక్తికరంగా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు కేవలం వార్తలను అందించడానికే పరిమితం కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధులుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ హాజరయ్యారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి రిపోర్టర్ పై ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు వారధులు పాత్రికేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇన్‌చార్జి డీపీఆర్వో ఎన్ వై గిరి, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్,రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి, లతీఫ్, ప్రధాన కార్యదర్శి తోట రాజేష్, ఉపాధ్యక్షులు మూదాం శంకర్ పటేల్, కౌసర్ అలీ,కొశాధికారి, బాలయ్య, ముదాం వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆబిద్,ప్రధాన కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముదాం శివశంకర్, చక్రధర్, నాయకులు ఎర్రవట్టి పోశిరాం, మొయినుద్దీన్, గంట చంద్రశేఖర్, మారుశెట్టి హనుమాడ్లు, కోటగిరి సతీష్, రుద్రంగి అశోక్, బర్ల సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


