పాత చర్లలో ఘనంగా వినాయక నిమర్జన వేడుకలు
సర్పంచ్ ప్రతినిధి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీకాంత్‌కు అపూర్వ సత్కారం
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):మండల కేంద్రంలో పాత చర్లలో వినాయక నిమర్జన వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి, భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయక ప్రతిమల నిమర్జనోత్సవం కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా స్థానిక యువకులు మరియు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కోలాహలంగా వేడుకల్లో పాల్గొన్నారు
శ్రీకాంత్ పనితీరు పై యువత హర్షం ఘన సత్కారం
పాత చర్ల యూత్ రాక్ స్టార్ శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ యువ వ్యాపారవేత్త, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం గారి భర్త శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు, సమాజంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన యువకులు, శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి తమ అభినందనలను తెలిపారు
అభివృద్ధే ధ్యేయంగా సేవా గుణంతో అడుగులు
చర్ల మండల అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న శ్రీకాంత్, అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో భాగస్వాములు అవుతున్నారు,నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, స్థానిక అభివృద్ధి పనుల వేగవంతం కోసం ఆయన శ్రమిస్తున్నారు, కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా, సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే శ్రీకాంత్ నేడు మండల ప్రజల హృదయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు
చైతన్యవంతమైన నాయకత్వంతో ముందుకు
ఒకవైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే, మరోవైపు సమాజానికి తిరిగి ఏదో ఒకటి చేయాలనే తపనతో శ్రీకాంత్ సాగిస్తున్న ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం, పండగ వాతావరణాన్ని తలపించేలా చర్లలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారం ఎనలేనిది అని కామెడీ సభలు చెప్పుకొచ్చారు, ఈ సత్కార కార్యక్రమం ద్వారా ఆయన చేసిన సేవలకు సముచిత గౌరవం లభించిందని యువకులు తెలిపారు, నిమర్జన వేడుకల సందర్భంగా జరిగిన ఈ అభినందన కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


