హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయం
హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం
శోచనీయమని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఆర్ శివప్రసాద్ అన్నారు.
నిజామాబాద్ : హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయమని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఆర్ శివప్రసాద్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
అంబేద్కర్ సిద్ధాంతాలను బీజేపీ గౌరవిస్తుంది..
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అంబేడ్కర్‌ను ప్రపంచ మేధావిగా గౌరవిస్తుందన్నారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం అత్యంత శోచనీయమన్నారు. బీజేపీ ఏనాడూ బాబాసాహెబ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయదన్నారు. వివాదాస్పద పుస్తకం రాసిన ఆ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు తెరవెనుక ఉండి బీజేపీని బద్నాం చేయడానికే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారు. దళిత సమాజాన్ని బీజేపీకి దూరం చేయాలని, హిందూ సమాజంలో చీలికలు తీసుకురావాలని వారు పన్నుతున్న కుట్రలను బీజేపీ ఎప్పటికీ సాగనివ్వదని స్పష్టం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే.. ఈరోజు ఒక సామాన్య చాయ్‌వాలా, ఓ బీసీబిడ్డ అయిన నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి కాగలిగారన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు గుంజలి నాగభూషణ్, పులి యుగంధర్, ఉపాధ్యక్షులు ఎడ్ల బాలకృష్ణ, మురళీకృష్ణ, దయా ప్రవీణ్, జిల్లా కోశాధికారి పవర్ సాయినాథ్, కార్యదర్శులు రాహుల్, అఖిలేష్, బుడ్డా సృజన్, శ్రీనివాస్, శంకర్, కార్యవర్గ సభ్యులు సతీష్, శ్రీనివాస్, మహేందర్, అవినాష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


