నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి
యువత ప్రజల్లో అవగాహన కల్పించాలి - నోబుల్ యూత్ అధ్యక్షుడు నరేష్.
రేగోడ్(మెదక్ ): ఎల్ నినో ప్రభావాల నేపథ్యంలో రేగోడ్ మండల ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నోబుల్ యూత్ అధ్యక్షుడు నరేష్ సూచించారు.రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగులో నీటి పొదుపు పద్ధతులు పాటించాలని తెలిపారు.మండల యువత ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని,ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని కాకుండా ప్రజలే సొంతంగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం చేపట్టాలని ప్రజలను కోరారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
27 Oct 2026 16:21:01
కాసిపేట మండలం తాటిగూడ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు తీరును గ్రామ సర్పంచ్ మడావి వెంకటేష్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న
