నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాలు కరువు ప్రభావితంగా గుర్తింపు

ఖరీఫ్‌లో వర్షాభావంతో పంట నష్టం - రైతులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశం

నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాలు కరువు ప్రభావితంగా గుర్తింపు

నాగర్ కర్నూలు : 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ఈ నెల 24న జీఓ ఎంఎస్ నం.03 జారీ చేసింది. ఖరీఫ్ సీజన్‌లో వర్షపాతం లోటు, పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ శాతం తక్కువగా ఉండటం, ఉపగ్రహ చిత్రాల (శాటిలైట్) డేటా ఆధారంగా కరువు తీవ్రతను అంచనా వేసి ఈ మండలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కరువు ప్రభావిత మండలాల్లో రైతులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా రైతులకు రుణ సదుపాయాలు కల్పించడం, ఉపాధి హామీ పనులు కల్పించడం, తాగునీటి, పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని సూచించింది. అలాగే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించింది.
కరువు ప్రభావిత మండలాలు: చారకొండ, వెల్దండ, ఊరుకొండ, పెద్దకొత్తపల్లి, వంగూరు, అమరాబాద్, పదర, బల్మూర్, లింగాల, కోడేరు, బిజినపల్లి, కల్వకుర్తి తదితర మండలాలు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్