ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ వేగవంతం చేయాలి

నిర్వాసితులకు సత్వరమే పరిహారం.. అధికారులకు కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశం

 ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ వేగవంతం చేయాలి

ఆదిలాబాద్ : జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావులేకుండా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన పెండింగ్‌ అంశాలను త్వరితగతిన పరిష్కరించి, క్షేత్రస్థాయిలో పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐ ఎ ఎఫ్) పర్యవేక్షక బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమి వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన సర్వే, భూసేకరణ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విమానాశ్రయ అభివృద్ధిలో భూసేకరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భూసేకరణకు సంబంధించిన అన్ని అంశాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న భూ సర్వే పనులను పకడ్బందీగా చేపట్టాలని, సర్వే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సేకరించి, ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి భూ నిర్వాసితుడికి అందాల్సిన పరిహారం, పునరావాస ప్రయోజనాలు సత్వరమే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, భూములకు సంబంధించిన రికార్డులు, హక్కులు, ఇతర వివరాలను నిశితంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.భూసేకరణకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన సర్వే, భూముల వివరాల సేకరణ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు, పరిష్కరించాల్సిన అంశాలపై జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చేపడుతున్న చర్యలను తెలియజేశారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఎయిర్‌ఫోర్స్‌ పర్యవేక్షక బృందం సభ్యులు కెప్టెన్‌ రాకేష్‌, ఎస్‌.ఆర్‌. సింగ్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ల్యాండ్‌ సర్వే ఆర్‌ఏడీ ప్రభాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!