జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలో ఇందూరి చిన్నారి కామాఖ్య ప్రతిభ
నిజామాబాద్ : ఇందూరి చిన్నారి కామాఖ్య (విభా శ్రీ తేలి) జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలో తన అసమాన ప్రతిభను చాటుకుంది. హైదరాబాద్‌లోని *చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)*లో నిర్వహించిన Dyuthi 2026 – National Performing Arts Festivalలో భాగంగా జరిగిన AANGIKAM – National Classical Dance Competitionలో చిన్నారి కామాఖ్య కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది.తన అపూర్వమైన హావభావాలు, అభినయం, నృత్య భంగిమలు, లయబద్ధమైన కదలికలతో జడ్జిలను మాత్రమే కాకుండా, కార్యక్రమానికి హాజరైన అశేష ప్రేక్షకులను సైతం మంత్ర ముగ్ధులను చేసింది.నృత్యమే ప్రాణంగా… నృత్యమే వేదంగా… అతి చిన్న వయస్సులోనే నృత్యంలో ఓనమాలు దిద్ది, “ఇంతింతై వటుడింతై” అన్నట్లుగా తన ప్రతిభను అంచెలంచెలుగా చాటుకుంటూ ముందుకు సాగుతున్న చిన్నారి కామాఖ్యకు ఇది మరో మైలురాయి. తన అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా గౌరవనీయులు వేదాంత రాధే శ్యామ్ గారి చేతుల మీదుగా క్యాష్ అవార్డు మరియు మెమెంటో అందుకుని సత్కారం పొందింది.చిన్నారి కామాఖ్య తన ప్రతిభతో తల్లిదండ్రులకు, గురువులకు, ఇందూరు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.చిన్నారి కామాఖ్యకు హృదయపూర్వక అభినందనలు… భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన నృత్య ప్రతిభను చాటాలని ఆకాంక్షిద్దాం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


