తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి
మంత్రి పొన్నం ను కలిసిన పంతులు తండా సర్పంచ్ చిన్నా నాయక్ బృందం.
అత్తన్నపేట :మన గ్రామం మన బాధ్యత అభివృద్ధి అని సంకల్పంతో గ్రామాల అభివృద్ధికి తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ పంతులు తండా గ్రామ సర్పంచ్ చిన్న నాయక్ బృందం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నంత ప్రభాకర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అక్కన్నపేట మండలంలో చాలా పంచాయతీ తండాలు ఉన్నాయని,తండాలలో అనేక సమస్యలతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారితో చెప్పారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


