అయ్యప్ప స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్స వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అయ్యప్ప గోశాల నిర్వాహకులు మర్యాల శ్రీనివాస్ - రమా దేవి దంపతుల ఆధ్వర్యంలో గణపతికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ దంపతులచే గణపతి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ పవిత్ర పూజా కార్యక్రమాల్లో పాల్గొనగోరే భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కోశాధికారి నారాయణరెడ్డి, నాయకులు గందే యాదగిరి, లక్ష్మారెడ్డి, కైలాస ప్రశాంత్, విక్రాంత్, అంజయ్య, గందే సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


