ముందే చెప్పిన విజన్ ఆంధ్ర
గందరగోళం లా డబల్ బెడ్ రూముల బాగోతం - రదైనా లక్కీ డ్రా.
- బాల్కొండ లో డబుల్ బెడ్ రూముల బాగోతాలు
- జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
- ఆందోళన చెందుతున్న దరఖాస్తు దారులు
బాల్కొండ(నిజామాబాదు జిల్లా) విజన్ ఆంధ్ర సెప్టెంబర్ 30:-తెలంగాణ ప్రభుత్వo ప్రజా పాలన, గ్రామ సభలు ఏర్పాటు చేయగ డబల్ బెడ్ రూముల కోసం దరఖాస్తుల నమోదు చేసిన రిజిస్టర్లు కనపడ కుండా పోయిందని బాల్కొండ లో బుధవారం రోజు బాల్కొoడ 2వ విడుత డబల్ బెడ్ రూముల లక్కీ డ్రా ఎంపిక ఆపి వెయ్యాలని సభలో హాజరైన ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో దాదాపు మూడు గంటల పాటు సభను అపి వేసిన అనంతరం 2వ విడుత డబుల్ బెడ్ రూము ఎంపిక ఆపి వేసినట్లు అధికారులు తెలియజేసారు..2వ విడుత డబుల్ బెడ్ రూము అనర్హుల జాబిత మరియు ఆన్లైన్ నంబర్లు ఉన్న వారి (99) మంది లబ్ది దారుల జాబితా లో క్రమ సంఖ్య (01) నుండి (54) ఇంటి నుంబర్ లు ఉండగా క్రమ సంఖ్య (01) నుండి (55)నుండి (99) వర్షకు ఇంటి నెంబర్లు ఎందుకు చూపలేదని ప్రజలు నీలదీయ డంతో అధికారులు కంగూ తిన్నారు.సభ గందరగోలానికి దారి తీయగ ఆన్లైన్ వ్యవ హారంలో అనర్హుల జబితాలో ఆన్లైన్ నెంబర్ లేకుండానే సీరియల్ నెంబర్ 1 నుండి 407 వరకు ఇంటి నెంబర్లు ఉన్నాయ.కానీ 408 నుండి 987 ఆన్లైన్ నుంబర్లు ఇచ్చి, ఇంటి నెంబర్లు ఎందుకు చూయించ లేదని,దీన్ని అదునుగా చేసుకొని కొంత మంది బ్రోకర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటింటి సర్వే కోసం వస్తున్నా రని తమ దరఖాస్థులు ఆన్లైన్ లో ఎక్కించడానికి కొంత సమర్పించుకుంటే మీ దర ఖాస్తూలు ఆన్లైన్ లో చేరుస్తా మని ప్రచారం చేశారు, దింతో కొందరు తెలివిపరులు డబల్ బెడ్ రూమ్ ఎలాగైనా కావాలనే ఉద్దేశంతో తమ పేర్లను లోపా యికారి " ఆమ్మ్యామ్యా యా " ఒప్పందంలో భాగంగా ఐదు నుండి 10 వేల వరకు నజ రాణాలు ఇచ్చుకొని ఆన్లైన్ లో నంబర్లు ఉండేలా చూసు కున్నారని తెలుస్తుంది. బుధవారం సభలో తమ దరఖాస్తులు ఎక్కడా అని లబ్దిదారులు ప్రశ్నిస్తే యే సమాధానం చెప్పలేక ఉండి పోయారు.పైగా ఆన్లైన్ నంబర్లు కేటాయించిన లబ్ధి దారు లందరూ ఉన్నత సంపన్న వర్గాల చెందిన కుటుంబాల వారు కావడం విశేషం.ఇందులో
కింది స్థాయి నుండి ఎం. పి .డి.ఓ స్థాయి వరకు ఎంత అవినీతి జరిగిందో అర్థం అవుతుందని జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై సబ్ కలెక్టర్ స్థాయి అధికారి నెత్రుత్వంలో విచారణ చేస్తే నిజ నిజాలు బయటికి వస్తాయని శుక్రవారం వారం రోజున జిల్లా కలెక్టర్ కు ఈ నెల 25 న ఫిర్యాదు చేసారు.ఆన్లైన్ లో నమోదు కాకుండా చేయడం ఇదేo లాజిక్కో అర్థం కావడం లేదని ప్రదీప్ కుమార్, నర్సింగ్ రావు లు ప్రశ్నిస్తున్నారు. "తప్పులు చేసినోళ్లు సంపాదించుకొని పోయారని " నష్ట పోయింది ప్రజలే అంటున్న నిజామా బాదు జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సామాజిక సాంస్కృతిక విభాగం అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్ కుమార్, నర్సింగరావు ఆరోపిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ల పంపిణి "లక్కీ డ్రా" పేరుతో ప్రజానీకం ముందు డ్రామా ఆడి డబల్ బెడ్ రూమ్ ల ఎంపికల్లో ఉద్యోగులకు, ఆర్ధికంగా, వ్యవ సాయ భూములు,ఇల్లు ఉన్న వారికే ఇచ్చు కున్నట్లు ఆరోపణ లు అనేకంగా ఉన్నాయని సభలో ఉన్న వారు ఆరో పించారు.తాము అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఎలాంటి వ్యవసాయ భూములు లేవని డబల్ బెడ్ రూముల ధరఖాస్తులకు " ఆన్లైన్ నుంబర్ కోసం కొందరు డబ్బులు ఇచ్చిన వారి ధరఖాస్తుల కే ఆన్లైన్ నుంబర్లు ఇచ్చారాని ప్రజలు విమర్శించారు.మొదటి విడుత ప్రజా పాలన లో (01-01- 2024) బి.ఏల్. కే /సి 21/ 010,అలాగే గ్రామ సభలో (23-01-2024)రసీదు నేం బి.ఏల్. కే /సి 18/0064 , అలాగే గ్రామ సభలో రిజిస్టర్ లో క్రమ సంఖ్య (06), పైగా హైదరాబాద్ లోని జ్యోతి రావు పూలె ముఖ్య మంత్రి కార్యా లయంలో దరఖాస్తూ నేం 01112024 111239, పా. పా. రసీదు నేం బి.ఏల్. కే /సి 18/0063, అలాగే గత గ్రామ కార్యదర్శి నమోదు సంఖ్య 2092 05/6776623,ఫోన్ మెసేజ్ కూడా ఇచ్చారని,కానీ 2వ విడుత డబల్ బెడ్ రూముల్లో కూడా మా పేర్లు లేవని వారు ఆరోపించారు. తమ దరఖాస్తులు చేసుకోగా రిజిస్టర్ లో క్రమ సంఖ్య (05) నమోదు చేసారని గత గ్రామ కార్యదర్శి విచారణ చేసి మా పేర్లు ఆన్లైన్ లో నమోదు చేయలేదని కొందరు ఆరోపించారు.
ఒకేరోజు రెండు సభలా ?
బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక గ్రామ పంచాయతీ కార్యాల యంలో బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామ సభ నిర్వహించగా ఇదే రోజున రెవెన్యూ శాఖ వారు డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఎంపిక ఉదయం 11 గంటలకు రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికి తెలియడం లేదు, అధికార పార్టీ ఎంపిక చేసిన లబ్ధిదారులు ఎంపిక జాబితాలో అనేక అవక తవకులు ఉన్నాయని గ్రామ ప్రజలతో పాటు అన్ని రాజ కీయా పార్టీల నాయకులు రైతు వేదికలో ఉన్న అధికారులతో వాగ్వివాదం జరిగిన అనంతరం కొన్ని గంటల పాటు లక్కీ డ్రా వాయిదా పడింది.
ఇలా చేస్తే ఏ సమస్య రాదు
బాల్కొండ లో 2 వ విడుతా డబల్ బెదురూము ల జాబితాను రద్దు చేయాలనీ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల సునీల్ కుమార్ గారికి విజ్ఞప్తి చేసారు. లేని పక్షంలో పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుందని అయన విజ్ఞప్తి చేస్తూ రెండో విడుతా డబల్ బెడ్ రూముల ఎంపిక బాల్కొండలోని అన్ని కులాల పెద్ద మనుషు లతో లబ్ధిదారుల ఎంపిక చేయిస్తే ఎలాంటి సమస్యలు రావని విజ్ఞప్తి చేస్తున్నాను.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


