బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి నరేష్​

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి నరేష్​

నిజామాబాద్ : బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రూరల్​ ఇన్​ఛార్జీగా బండారి నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ​బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ వివరాలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులుతో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు.
బీసీ సంఘం బలోపేతానికి..
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ మాట్లాడుతూ.. బీసీ సంఘం బలోపేతం చేయడంలో భాగంగా వివిధ నియోజకవర్గ ఇన్​ఛార్జీలకు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం పటిష్ట నిర్మాణాన్ని చేయాలని జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారన్నారు. ఆయన సూచనల మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇన్​ఛార్జీగా బండారి నరేష్ గారిని నియామకాన్ని చేపట్టినట్లు నరాల సుధాకర్​ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోనే పెద్దదైన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బండారి నరేష్ నియామకంతో సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్ దేశాయి గంగాధర్, అంకం రావు, బాలన్న, హన్మాండ్లు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News